సత్యాగ్రహం నుంచి స్వచ్ఛాగ్రహం: మోడీ

modiజాతిపిత మహాత్మా గాంధీ వందేళ్ల కిందట చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. బీహార్‌లోని మహాత్మా గాంధీ చంపారన్‌లో నిర్వహించిన సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మాట్లాడారు. స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని సత్యాగ్రహం నుంచి స్వచ్ఛాగ్రహంగా అభివర్ణించారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమానికి ఇదొక గొప్ప పండుగ సమయమని తెలిపారు.

బీహార్‌లో తన సత్యాగ్రహంతోనే గాంధీజీ మహాత్ముడిగా.. బాపూగా మారారని అన్నారు ప్రధాని మోడీ. సత్యాగ్రహ స్ఫూర్తితో పరిశుద్ధ భారత్‌కోసం 20 వేల మంది స్వచ్ఛాగ్రాహిలు కృషిచేస్తున్నారన్నారు. గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణను వీరు ప్రోత్సహిస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆరోగ్యకర వాతావరణం 50 శాతం కన్నా తక్కువ ఉన్న రాష్ట్రం బీహార్ ఒక్కటే. అయితే ఓ వారం ప్రచారం తర్వాత గొప్ప పురోగతి కనిపించింది.

ఇది కొత్త ఆరంభానికి నాందిగా పరిగణించాలని  మోడీ పిలుపు ఇచ్చారు. జయప్రకాష్‌ నారాయణ్‌ సైతం తన ఉద్యమానికి మహాత్మా గాంధీ నుంచే స్ఫూర్తి పొందారన్నారు. బీహార్‌ రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టారని అన్నారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates