సద్దుల స్పెషల్.. 17న కళ్లు చెదిరే ప్రోగ్రామ్స్

హైదరాబాద్ : తెలంగాణ ‘రాష్ట్ర పండుగ’…  బతుకమ్మ పండుగను విశ్వమంతటా ప్రచారం చేసేందుకు సరికొత్త కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. బ్రహ్మ కుమారిస్ సంస్థ ఇందుకు సహకారం అందించబోతోంది. రవీంద్రభారతిలో ఈనెల 17వ తేదీన ‘సద్దుల బతుకమ్మ’ రోజున ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో… లేజర్ షో నిర్వహిస్తారు. కళ్లు జిగేల్మనిపించేలా ఫైర్ వర్క్స్ షో ఉంటుంది. వెయ్యి మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం… సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చెప్పారు.

సద్దుల పండుగ నాడు… పూల బతుకమ్మలు ఆకట్టుకోనున్నాయి. ‘ఆకాశంలో బతుకమ్మ’ పేరుతో పారాచూట్ లతో బైసన్ పోలో గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆకాశంలో బతుకమ్మ ఆకారాన్ని ఆవిష్కరిస్తారు. ‘నీటిలో బతుకమ్మ’ అనేది మరో వెరైటీ కాన్సెప్ట్. అదేరోజు రవీంద్రభారతిలో… ఫొటో గ్రఫీ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు బుర్రా వెంకటేశం.

Posted in Uncategorized

Latest Updates