సన్యాసి చీకటి బాగోతం : కడుపునొప్పి తగ్గిస్తానంటూ అత్యాచారం

babaక్షుద్ర పూజల పేరుతో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఓ దొంగ బాబాకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది మథుర ఫాస్ట్ ట్రాక్ కోర్టు. బాబా దగ్గరకు వెళితే కడుపునొప్పి తగ్గుతుందని భావించిన మహిళ.. అతని దుష్టచర్యలకు బలైన ఘటన త్తరప్రదేశ్ లోని హత్ రాస్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని హత్‌ రాస్‌ కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. బృందావన్‌ లోని ద్వారకాదాస్‌ ఆశ్రమానికి వెళితే నొప్పి తగ్గిపోతుందని కొందరు చెప్పిన మాటలను నమ్మి.. జూలై 2017లో తన భర్తను తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. పూజ చేసి శాశ్వతంగా కడుపునొప్పి తగ్గిస్తానని నమ్మబలికాడు ద్వారకాదాస్. పూజ పేరుతో ఆమె భర్తకు ఓ దీపాన్ని ఇచ్చాడు బాబా. దీపం ఆరిపోయే వరకూ పై అంతస్తులోకి రావొద్దని చెప్పాడు. ఆమెను పైఅంతస్తులోని గదికి తీసుకెళ్లాడు. నీ శరీరంలోకి దుష్ట శక్తులు చొరబడ్డాయని చెప్పాడు. వాటిని తొలగిస్తానంటూ అఘూయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే మీ కుటుంబం మొత్తం సర్వనాశనం చేస్తానని ఆ మహిళను బెదిరించాడు. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే బాధపడింది.

కొన్నిరోజుల తర్వాత బెదిరింపులతో మరోసారి ఆమెపై అత్యాచారం చేశాడు బాబా ముసుగులోని ద్వారకాదాస్. దీంతో ఆ మహిళ భర్తకు అసలు విషయం చెప్పింది. దంపతులిద్దరూ మధుర  పోలీసులకు బాబాపై కంప్లయింట్ చేశారు. విచారణ చేపట్టిన మధుర ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు.. ద్వారకాదాస్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 27వేల జరిమానా విధించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates