సభలోనే మోడీకి రాహుల్ హగ్

అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం (జూలై-20) లోక్‌ సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్యన ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానిపై మాటల తూటాలు పేల్చిన రాహుల్.. తన స్పీచ్ ముగిసిన తర్వాత ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు రాహుల్‌ గాంధీ. తన సీటు నుంచి నేరుగా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లారు. మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటికీ ప్రధాని కూర్చునే ఉన్నారు. ఆ తర్వాత.. కూర్చున్న మోడీని.. రాహుల్ ఆలింగనం చేసుకుని అందర్నీ ఆశ్చర్య పరిచారు.

రాహుల్ ఇచ్చిన ట్విస్ట్ తో మోడీతోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల ఎంపీలు షాక్ అయ్యారు. తన సీటు దగ్గర వచ్చిన రాహుల్ హావభావాలు చూసి ప్రధాని మోడీకి మొదట అర్థం కాలేదు. హగ్ చేసుకోవటానిక ిరాహుల్ లేవమని సైగ చేస్తుండగా.. అర్థం కానీ మోడీ ఏంటీ అని ప్రశ్నించటం కనిపించింది. ఆ తర్వాత కూర్చున్న మోడీనే హగ్ చేసుకున్న రాహుల్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. మోడీనే మళ్లీ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి.. అభినందనలు చెబుతారు. ఆ తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. మీ దృష్టిలో నేను పప్పూనే కావచ్చు.. నాపై మీకు చాలా ద్వేషం ఉంది.. అయితే నాకు మీ మీద కోపం లేదు అని రాహుల్ గాంధీ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates