సభలో ఉద్రిక్తత : బీహార్ సీఎంపై చెప్పు దాడి

పాట్నా : బీహార్ సీఎం నితీష్ కుమార్‌ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అతడిపై చెప్పు విసిరాడు. ఇవాళ (అక్టోబర్-11) పాట్నాలో జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ నిర్వహించిన సమావేశంలో నితీష్ మాట్లాడుతుండగా.. ఈ ఘటన జరిగింది.  ఈ సమయంలో జనతాదళ్‌ లో ఈ మధ్యే చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌ కు చెందిన చందన్ కుమార్‌ గా గుర్తించారు.

రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడని చెప్పారు పోలీసులు. అతనో అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో.. తన అసంతృప్తిని ఇలా తెలిపాడట చందన్. అతడు నితీష్‌ పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు చందన్ పై దాడి చేశారు. సభలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి చందన్‌ ను విడిపించుకొని వెళ్లారు. సీఎం నితీష్‌ పైకి చెప్పు విసరడం ఇది రెండోసారి. 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌ పైకి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన చందన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates