సమంతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు : కేటీఆర్

ktrmandali11సినీ నటి సమంత ఉచితంగా చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని.. ఆమెకు తెలంగాణ సర్కార్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. మంగళవారం (మార్చి-27) శాసనమండలిలో చేనేత రుణాలు-హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..గత ప్రభుత్వ హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవన్నారు.

వ్యవసాయం తర్వాత తెలంగాణలో కీలక రంగం చేనేత రంగమని తెలిపారు కేటీఆర్. తమది చేనేతల, చేతల సర్కారు అని తెలిపిన మంత్రి.. దేశంలో ఎక్కడ చేనేత రంగంలో చూసినా మనవారే ఉన్నారన్నారు. 2002లో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2007లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు.

తెలంగాణలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చేనేత రుణమాఫీని పక్కా ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సారి కూడా బతుకమ్మ చీరలు సిరిసిల్లలో తయారు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి.. గత సంవత్సరం సూరత్ నుంచి వచ్చిన చీరల్లో కొన్ని నాసిరకం వచ్చాయని, చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణ యుగమన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates