సమంత ట్విట్ : తొలి చూపులోనే ప్రేమించుకున్నాం

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత..ఓ పిక్ పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ అభిమాని ట్వీట్ చేసిన ఫోటోపై సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ లో ఎడిట్‌ చేసిన ఫొటోను అల్లు అర్జున్‌ అడిక్ట్‌ అనే ట్విటర్ అకౌంట్‌ లో పోస్ట్ చేసి ఏంటిది.. అంటూ కామెంట్ చేశారు. ఈ ఫొటోపై స్పందించిన సమంత తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. సమంత ఇచ్చిన రిప్లై పై సినీ ప్రముఖులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. మరి ఈ ఫోటోపై చైతూ ఎలా ఫీలవుతాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల యు టర్న్‌, సీమరాజ సినిమాల షూటింగ్‌ ను పూర్తి చేసిన సమంత, సూపర్‌ డీలక్స్‌ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates