సమంత మంచి మనసు

హీరోయిన్ సమంత మానవత్వం చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఫోనాక్ అనే సంస్థ గత 70 ఏళ్లుగా వినికిడి లోపం ఉన్న చిన్నారుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తోంది. దీనిపై శాస్త్రీయ పరిశోధనలు కూడా చేపడుతోంది. ఇదే సంస్థ ఏ యూనిట్ ఆఫ్ హియరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ తో కలిసి వినికిడిలోపంతో బాధ పడుతున్న చిన్నారులను గుర్తించేందుకు ఉచిత శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ఏపీ, తెలంగాణాలో 36 బ్రాంచీలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సమంత ఈ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. వినికిడి లోపంతో బాధపడుతున్న పది మంది చిన్నారులకు.. వినికిడి యంత్రాలు అందించారు. ఈ సంస్థకు భవిష్యత్తులోనూ తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు సమంత అక్కినేని. సమంత హీరోయిన్ నటించిన రంగస్థలం సినిమాలో.. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం కలిగిన సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా నటించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates