సమస్యను ట్విట్టర్ పరిష్కరించింది : మంత్రి కేటీఆర్ – యాంకర్ ప్రదీప్ సంభాషణ

KTR-Pradeepయాంకర్ ప్రదీప్ మరోసారి సోషల్ మీడియా వైరల్ అయ్యాడు. మొన్నటికి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే.. ఇప్పుడు ఓ సామాజిక అంశంపై స్పందించాడు. A School With No Toilet పేరుతో ఓ ఎన్జీవో సంస్థ ట్విట్ కు సపోర్ట్ చేస్తూ.. ఆ లింక్ ను అటాచ్ చేస్తూ కేటీఆర్ కు ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వటం.. దానిపై యాంకర్ ప్రదీప్ థ్యాంక్స్ చెప్పటం చకచకా జరిగిపోయాయి. వీళ్లిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ హాట్ టాపిక్ అయ్యింది.

ప్రదీప్ ట్విట్ :

చర్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 40ఏళ్ల క్రితం నిర్మించారు. 120 మంది బాలికలు, 100 బాలురు ఉన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత పిల్లలు సరైన మోతాదులో మంచినీళ్లు తాగటం లేదు. ఎందుకంటే.. పాఠశాలలో టాయ్ లెట్స్ లేవు. చాలా దూరం వెళ్లాలి. ఈ ట్విట్ ను మంత్రి కేటీఆర్ కు లింక్ చేస్తూ.. మా బృందం పర్సనల్ గా పరిశీలించిన చెబుతున్న మాట ఇది. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బాలికలు. సార్.. వీలైనంత త్వరగా దీనిపై చర్యలు తీసుకోండి ప్లీజ్ అని ట్విట్ చేశాడు యాంకర్ ప్రదీప్

మంత్రి కేటీఆర్ ట్విట్ :

ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేడ్చల్ కలెక్టర్ స్పందిస్తారు. వెంటనే చర్యలు తీసుకుని.. అప్ డేట్స్ ఇవ్వండి అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మేడ్చల్ కలెక్టర్ :

DEO పాఠశాలను పరిశీలిస్తారు. ఉన్న టాయిలెట్స్ ను ప్రస్తుతానికి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ వెంటనే కొత్త మరుగుదొడ్లు నిర్మాణానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం అని కలెక్టర్ స్పందించారు.

ప్రదీప్ ట్విట్ :

థ్యాంక్యూ సో మచ్ సార్… అంటూ ముగించారు.

Posted in Uncategorized

Latest Updates