సమాజాన్ని మార్చే శక్తి ఉంది : వరంగల్ మహిళపై ప్రధాని ప్రశంసలు

మహిళా సాధికారతతోనే దేశంలో దురాచారాలకు ఆగుతాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. సమాజాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందన్నారు. వారికి ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని చెప్పారు. స్వయం సహాయక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ప్రధాని. ఇందులో భాగంగా వరంగల్ మహిళ కౌసిర్ షాహిన్… మోడీతో ముచ్చటించారు

మహిళలు స్వయం సమృద్ధిలో దూసుకుపోతున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏ రంగంలో అయినా మహిళలు విజయాలు సాధిస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ మొబైల్ యాప్ తో నిన్న దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడారు ప్రధాని. మహిళలు అద్భుతమైన వ్యాపారవేత్తలని, సమాజాన్ని మార్చే శక్తి వారికే ఉందన్నారు. మహిళా ప్రాతినిధ్యం లేకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవసాయం, పశుపోషణ విభాగాలను ఊహించలేమన్నారు మోడీ.

ఈ కార్యక్రమంలో వరంగల్ కు కౌసిర్ షాహిన్ ప్రధాని మోడీతో మాట్లాడింది. పొదుపు సంఘాలతో సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో వివరించి ప్రధాని ప్రశంసలు అందుకుంది షాహిన్. పొదుపు సంఘాల పనితీరు, ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకుంది. వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలకరించేందుకు నిర్వహించిన జన్ సంవాద్ కార్యక్రమం భాగంగా షాహిన్ తో మాట్లాడింది. వరంగల్ అర్భన్ జిల్లా వేలేరు కు చెందిన కౌసర్ షాహిన్ తనకు ప్రధానితో మాట్లాడే చాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates