సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి : ఘనంగా దాశరథి 94వ జయంతోత్సవాలు


రవీంద్రభారతిలో మహాకవి దాశరథి 94వ జయంతోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులు, మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజానికి దాశరధి చేసిన సేవలను గుర్తుచేశారు శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్. కలంతో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన మహాకవి అన్నారు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ. ఉద్యమానికి ఊపుతెచ్చే కవితలు, పద్యాలతో సమాజాన్ని మేలుకొల్పారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాకే వన్నెతెచ్చిన అగ్నిధార దాశరథి అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి. ఏన్నేళ్లైనా ప్రజల మదిలో నిలిచిపోయే మహాకవి దాశరధిగా కీర్తించారు సిధారెడ్డి.
జైలులో గడిపిన సమయంలో పేపర్, కలం లేకపోవటంతో… చందస్సు ఆధారంగా పద్యాలను మహాకవి దాశరథి జ్ఞాపకంలో ఉంచుకున్నారని గుర్తుచేశారు సీఎంవో పీఆర్వో దేశపతి శ్రీనివాస్. తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంతో జోడించి సమాజాన్ని మేలుకోల్పిన గొప్పవ్యక్తి అన్నారు..

Posted in Uncategorized

Latest Updates