సమాజ సేవలో : కేటీఆర్ కు చెక్కు ఇచ్చిన హీరో విజయ్

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన విజ‌య్ దేవ‌ర‌కొండ తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. గతంలో అతను ప్రకటించినట్లుగానే ఆ అవార్డును వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం కేటీఆర్ కు అందజేశారు. ఇటీవ‌ల‌ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేసారు. ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి రూ.25 లక్షలకు అవార్డును సొంతం చేసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో కేటీఆర్‌ని క‌లిసి 25 ల‌క్ష‌ల రూపాయల చెక్కును ఆయనకు అందించారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. కుటుంబ సభ్యుల‌తో క‌లిసి సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు హీరో.

Posted in Uncategorized

Latest Updates