సముద్రంలో డాల్ఫిన్స్ గ్యాంగ్ వార్ : తీరం కొట్టుకొచ్చిన 54 డాల్ఫిన్స్

dolphin

డాల్ఫిన్స్ చూస్తే ఎంత బాగుంటాయో కదా.. డాల్ఫిన్ షోస్ అంటే చాలు ఎగిరిగంతేస్తారు. అన్నీ ఇలా ఉండవు అంటా.. వీటిలోని కొన్ని జాతుల మధ్య వైరం ఉంటుందని చెబుతున్నారు. సముద్రంలో డాల్ఫిన్స్ జాతుల మధ్య గ్యాంగ్ వార్ కామన్ అంటున్నారు సముద్ర జీవరాశుల పరిశోధకులు. అలాంటి ఘటనపై ఇప్పుడు మెక్సికో దేశంలో జరిగింది.

మెక్సికో నార్త్ ప్రాంతంలోని ఓ బీచ్‌లో పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు‌ తీరం కొట్టుకొచ్చాయి. వాటిపై మరో రకం జాతి డాల్ఫిన్స్‌ దాడి చేయడంతో ఇవి తీరానికి కొట్టుకొచ్చాయని అధికారులు తెలిపారు. 54 డాల్ఫిన్లు ఒడ్డుకు వస్తే.. అందులో 21 చనిపోయాయని తెలిపారు. బాజా కాలిఫోర్నియా పెనిన్‌సులాలోని బహియా డీ లాపెజ్‌ తీరంలోకి కొట్టుకొచ్చిన ఆ డాల్పిన్లను కాపాడేందుకు జంతు ప్రేమికులు, అధికారులు తీవ్రంగా కష్టపడ్డారు. వాటిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు చాలా కష్టపడ్డారు.

మొత్తానికి 33 డాల్ఫిన్లను కాపాడి తిరిగి సురక్షితంగా సముద్రంలోకి పంపినట్లు ప్రకటించారు మెక్సికన్‌ పర్యావరణ సంరక్షణ విభాగం. తీరానికి వచ్చిన ఆ డాల్ఫిన్ల శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, బాటిల్‌నోస్‌ డాల్ఫిన్లు ఈ డాల్ఫిన్లపై దాడి చేసి గాయపరిచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కోసారి డాల్ఫిన్లు.. ఇతర డాల్ఫిన్లపై దాడి చేసి చంపేయగలవని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates