సమ్మర్ అయిపోయింది : రాష్ట్రం మొత్తం కూల్.. కూల్ వెదర్

cool-weatherరాష్ట్రంలో వాతావరణం మారింది. ఉదయం నుంచి చిరుజల్లులతోపాటు ఆకాశం మేఘావృతంగా ఉంది. ఎండ లేకపోగా.. కూల్ వెదర్ వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో సన్నటి జల్లులు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గాయి. శనివారం మధ్యాహ్నానానికి హైదరాబాద్ లో ఉష్ణోగ్రత 31 డిగ్రీలకు పడిపోయింది. నిన్నటి వరకు 40 డిగ్రీల ఎండ, ఉక్కబోతతో ఇబ్బంది పడిన ప్రజలు.. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారిగా 10 డిగ్రీల వరకు టెంపరేచర్ తగ్గిపోవటం.. చిరు జల్లులతో ఇక ఎండలు వెళ్లిపోయాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో సమ్మర్ అయిపోయింది. ఎండా కాలం ముగిసింది. అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలులతో చల్లగా మారిపోయింది. గాలులు తమ దిశ మార్చుకోవటంతో ఈ విధమైన వాతావరణం ఏర్పడింది. ఈ మార్పు.. నైరుతి రుతుపవనాల రాకకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలోని మార్పులతో.. రెండు రోజుల్లోనే తెలంగాణలోకి రుతుపవనాలు రానున్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ ముగిసిపోయింది అంటున్నారు వెదర్ ఎక్స్ పర్ట్స్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. కరీంనగర్ లో 35, వరంగల్ లో 34, ఆదిలాబాద్ 36, నిజామాబాద్ 34, ఖమ్మం 35, నల్గొండ 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండ తీవ్రత కూడా బాగా తగ్గింది. తేమ గాలులు వీస్తుండటంతో.. చల్లగా ఉంది. ఇక మెదక్ లో 27, మహబూబ్ నగర్ లో 26, రంగారెడ్డిలో 26 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అవుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 24 గంటలు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ వర్షం పడే సూచనలు అధికంగా ఉన్నాయని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates