సమ్మర్ ఎగ్జిబిషన్ లో విషాదం : జెయింట్ వీల్ నుంచి విరిగిపడిన పెట్టెలు

ANT DEATHఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రోబో యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో ఆదివారం (మే-28) రాత్రి ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ నుంచి రెండు పెట్టెలు విరిగిపడ్డాయి. అందులోని ఓ చిన్నారి పైనుంచి కింద పడి చనిపోయింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 50 అడుగుల ఎత్తు నుంచి జెయింట్ వీల్ పెట్టెలు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో కింద పడ్డాయి.

జెయింట్ వీల్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటం.. వేగంగా తిప్పటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎగ్జిబిషన్ కు వచ్చిన వారు అంటున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. నిర్వాహకులు పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తర్వాత కూడా యథావిధిగా ఎగ్జిబిషన్ కొనసాగించారు. ప్రమాదం మా వల్ల జరగలేదన్నట్లు వ్యవహరించారు. ఇంత జరిగినా ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఇలా జరిగిందంటున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates