సమ్మర్ లో క్లాసులు..ఇంటర్ బోర్డు ముందు ధర్నా

బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కాలేజీలు సమ్మర్ క్లాసెస్ నడుపుతున్నారని.. ఇంటర్ బోర్డు ముందు ధర్నాకు దిగింది ABVP. సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిబంధనలను పాటించని అయ్యప్ప సొసైటీలోని నారాయణ-శ్రీచైతన్య కాలేజీలను మూసేసి.. క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేట్ కాలేజీల్లో లైంగిక వేధింపులపైనా చర్యలు తీస్కోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆయా కాలేజీల హెడ్ ఆఫీస్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates