సమ్మెచేస్తే నష్టపోతారన్న ప్రభుత్వం..వెనక్కి తగ్గేది లేదన్నకార్మిక నేతలు

tmu
ఆర్టీసీ కార్మికులు  సమ్మెకు  వెళ్లకుండా ప్రయత్నాలు  చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మ్యాటర్ మళ్లీ సీఎం పేషీకి చేరుకుంది. ఆర్టీసీ గుర్తింపు  కార్మిక  సంఘం  నేతలతో  మంత్రుల కమిటీ శనివారం(జూన్-9) ఉదయం మరోసారి  చర్చలు జరిపింది.  మినిస్టర్స్ క్వార్టర్స్ లో  TMU నేతలతో  మంత్రుల  కమిటీ  భేటీ అయింది. సమ్మె  నిర్ణయాన్ని వాయిదా  వేసుకోవాలని  కార్మిక  నేతలను  కోరారు మంత్రులు . సంస్థ  ఇప్పటికే  నష్టాల్లో  ఉందని,  సమ్మెకు  వెళితే నష్టపోయేది  కార్మికులేనని  చెబుతోంది  ప్రభుత్వం.  యూనియన్ల  నాయకులు … ప్రజల కోణంలో  ఆలోచించాలనీ… ప్రత్యేక కమిటీ  వేసుకొని  ఇతర రాష్ట్రాల్లో  పరిస్థితిని  అధ్యయనం చేద్దామని  కోరింది.

డిమాండ్లపై  వెనక్కి  తగ్గేది లేదన్నారు కార్మిక సంఘాల  నేతలు.  వేతన  సవరణ  చేస్తేనే  సమ్మె నిర్ణయాన్ని వాయిదా  వేసుకుంటామంటున్నారు.  తెలంగాణ ఉద్యమ  సమయంలోనే  ఆర్టీసీ నష్టపోయిందని  చెబుతున్నారు. సమ్మె చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పారు కార్మిక సంఘాల  నేతలు.  TMU నేతలతో  భేటీ తర్వాత  మంత్రుల కమిటీ  ప్రత్యేకంగా  సమావేశమైంది. సమ్మె జరిగితే ఏం చేయాలనేదానిపై మంత్రుల కమిటీ డిస్కస్ చేసింది. ఆ తర్వాత మంత్రులంతా ప్రగతి భవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ తో మంత్రులు సమావేశం అయ్యారు. కార్యాచరణపై చర్చిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates