సరదాకి కూడా ఇలా చేయకండి : బైక్ టైర్ లో దూరి చక్కర్లు

పిల్లలు సరదాగా చేసిన పనులు కూడా ఒక్కొసారి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సైకిల్ టైర్ తో రైట్ రైట్ అంటూ ఆడుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఓ బుడతడు చేసిన విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరదాగా వీధుల్లో ఆడుకుంటున్న ఓ కుర్రాడు..బైక్ టైర్ తో భలే విన్యాసాలు చేశాడు. టైర్ మధ్యలోకి దూరి భలే విన్యాసాలు చేశాడు.

కొంతదూరం వరకు చక్కర్లు కొట్టిన ఈ బుడతడు..రివర్స్ లోనూ కాళ్లతో దూసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఫీట్ ను చూసిన వారంతా వాహ్ అంటున్నారు. అయితే ఈ చిచ్చర పిడుగు స్టంట్ ను సరదాకీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని, అది చాలా ప్రమాదకరమని పిల్లలకు సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Posted in Uncategorized

Latest Updates