సరికొత్త ఫీచర్లతో ఇన్ఫీనిక్స్ హాట్ ఎస్3

Infinix-Hot-S3మొబైల్స్ తయారీ సంస్ధ ఇన్ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘హాట్ ఎస్3’ ని బుధవారం(ఫిబ్రవరి7) విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో తన స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చింది ఇన్ఫీనిక్స్. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సాండ్‌స్టోన్ బ్లాక్, బ్రష్ గోల్డ్ కలర్స్ లలో విడుదలైన ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు…
5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Posted in Uncategorized

Latest Updates