సరిహద్దుల్లో సీక్రెట్స్ : దక్షిణ కొరియా అధ్యక్షుడితో మరోసారి భేటీ అయిన కిమ్

JONఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జె ఇన్ తో భేటీ అయ్యారు.శనివారం(మే-26) రెండు గంటలపాటు ఉత్తర-దక్షిణ కొరియాల సరిహద్దు గ్రామం పన్ మున్ జోమ్ లో ఈ మీటింగ్ జరిగింది. జూన్ 12 న సింగపూర్ లో ట్రంప్ తో భేటీ రద్దు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించారు.

ఇద్దరి మధ్యా నెల రోజుల వ్యవధిలో ఇది రెండో మీటింగ్.  దక్షిణకొరియా – అమెరికా సంయుక్త విన్యాసాలపై ఉత్తరకొరియా నిరసన తెలిపింది. నార్త్ కొరియాతో జరగాల్సిన ఉన్నతాధికారుల సమావేశాన్ని కూడా రద్దు చేసింది.  అయినప్పటికీ అధ్యక్షులిద్దరూ మళ్ళీ సమావేశం అయ్యారు. కొన్నిరోజుల క్రితమే నెల రోజుల వ్యవధిలో రెండవసారి చైనా వెళ్లి అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమైన కింగ్…. పలువిషయాలపై చర్చలు జరిపారు.

 

Posted in Uncategorized

Latest Updates