సర్కార్ గ్రీన్ సిగ్నల్ : ఏప్రిల్ నుంచే పెంచిన ఆసరా పెన్షన్లు

 ఏప్రిల్ నుంచి పెంచిన ఆసరా పెన్షన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కొత్త లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని సీఎస్ ను ఆదేశించారు. దీంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.

ఓటర్ లిస్ట్ ఆధారంగా లబ్ది దారులను ఎంపిక చేయనున్నారు. 57 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారికి పెన్షన్లు అందనున్నాయి. ఈ విషయంపై రేపు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 20 లక్షల మంది లబ్దిదారులను గుర్తించారు. ఇంకొంత మంది కొత్త వారిని గుర్తించాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates