RTC సమ్మెలేదు : డిమాండ్లకు ఓకే

KCR RTCకొన్ని రోజులుగా జరుగుతున్న  RTC చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు 16 శాతం IR (మద్యంతర భృతి) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (జూన్-10) జరిగిన చర్చపై మాట్లాడారు తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్, మహేందర్ రెడ్డి, ఈటల.

RTC బాగు పడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు మంత్రి కేటీఆర్. ఆర్టీసీ కార్మికులకు 16శాతం IR ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. 16 శాతం IRతో సంవత్సరానికి 2 కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీలో మార్పుల కోసం ప్రత్యేక కార్యచరణ రెడీ చేశామన్నారు. ఇదే విషయంపై మాట్లాడిన హరీష్..పెంచిన IRను జూలై నెల నుంచి వర్తింస్తుందన్నారు. ఈటల మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌ మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్న ఈటల.. ఆర్టీసీ ప్రతిరోజు 93 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని మంత్రి గుర్తు చేశారు.

RTC కార్మికులు IRను 25 శాతం అడుగగా.. 16 శాతం ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు సహకరించాలన్న మహేందర్ రెడ్డి..ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కార్మికుల కోసం IR ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు, టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి. దీంతో సమ్మె నోటీస్‌ ను ఉపసంహరించుకొన్నామని ప్రకటించింది RTC.

Posted in Uncategorized

Latest Updates