సర్కార్ స్కూల్ ప్రైవేట్ ఆఫర్ : ఒక్కో అడ్మిషన్ కు రూ.వెయ్యి నజరానా

500అతనో ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్. కాకపోతే ఎక్కడో మారుమూల గ్రామంలో. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు. మూడేళ్ల క్రితం జాయిన్ అయినప్పుడు 13 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఐదుగురికి పడిపోయింది. వచ్చే ఏడాది ఈ ఐదుగురు పిల్లలు కూడా లేకపోతే పరిస్థితి ఏంటీ.. అని ఆలోచించాడు. అంతే.. వెంటనే ఓ ఐడియా ఆలోచించాడు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెంచాలని నిర్ణయించాడు. అనుకున్నదే తడవుగా సొంత స్కీమ్ అమలు చేశాడు ప్రిన్సిపాల్. స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్న వెంటనే.. పేరంట్స్ కు వెయ్యి రూపాయల నగదు బహుబతి ఇస్తానని చెప్పాడు. పిల్లలకు బుక్స్ ప్రీ అని చెప్పాడు. యూనిఫాం కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు.

అంతే ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య 28 మందికి చేరింది. ఇచ్చిన మాట ప్రకారం.. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున.. 28వేల రూపాయలు చెల్లించాడు. ఇది జరిగింది కర్నాటక రాష్ట్రం ఉడిపి పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలోని కొన్ జాడీ గ్రామంలో. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పేరు సురేష్ శెట్టి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లంతా కున్బీ కమ్యూనిటీకి చెందిన వారు. టీచర్లు కూడా టైంకి వచ్చి.. పాఠాలు చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఫ్రీ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు అంటే.. బాధ్యత తీసుకున్నట్లే కదా అందుకే ఇప్పుడు వస్తున్నాం అంటున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు..

Posted in Uncategorized

Latest Updates