సర్పంచ్ మంచి మనసు : సర్కార్ బడికి బస్సు సౌకర్యం

సర్పంచ్ మంచి మనసుతో ఆ విద్యార్థులకు నిత్యం రానుపోనూ పదికిలోమీటర్ల నడక తప్పింది.  దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ఓ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించారు. సూర్యపేట జిల్లాలోని మఠంపల్లి మండలం చౌటపల్లి ప్రాథమిక పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని త్రివేణినగర్, బక్కమంతులగూడెం నుంచి విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు.

ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కొనసాగుతుండడంతో 250 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. దూరభారం కావడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో చౌటపల్లి సర్పంచ్ నలబోలు భవానీ వెంకట్‌రెడ్డి రూ.4 లక్షలతో బస్సును ఏర్పాటు చేయగా గురువారం (జూలై-19) జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి బస్సును ప్రారంభించారు. ఇదే స్కూల్‌ లో హైస్కూల్‌ కూడా కొనసాగుతున్నది. నడకనుంచి తమకు సర్పంచ్ విముక్తి కలిగించారని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు.

Posted in Uncategorized

Latest Updates