సర్వీస్ టాక్స్ చెల్లించని హీరో మహేష్ బాబు : బ్యాంక్ అకౌంట్స్ అటాచ్

హైదరాబాద్ : సర్వీస్ టాక్స్ కట్టలేదని హీరో మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్స్ అటాచ్ చేశారు GST హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు. 2007-08 సంవత్సరానికి సంబంధించి.. వివిధ వ్యాపార సంస్థల ప్రకటనల్లో నటించారు మహేష్. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. సెలబ్రిటీగా పలు ఈవెంట్లకు హాజరయ్యారు. వాటన్నింటి నుంచి వచ్చిన ఆదాయానికి.. అప్పట్లో అమలులో ఉన్న సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంది. మొత్తంగా ఆ సంవత్సరం కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖకు రూ.18.5 లక్షలు  కట్టాల్సి ఉందని తెలిపారు అధికారులు. వడ్డీ, జరిమానాతో కలిసి అది రూ.73 లక్షల 50 వేలకు చేరింది.

ఇన్నాళ్లుగా 2007-08 సంవత్సరానికి సంబంధించి సర్వీస్ టాక్స్ చెల్లించకపోవటంతో.. చర్యలకు సిద్ధమయ్యారు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు. మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేశారు. మహేష్ బాబు యాక్సిస్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.41లక్షల 96వేల 640లను రికవరీ చేశారు. ఇంకా రూ.31 లక్షల 47వేల 994లు మహేష్ బాబు చెల్లించాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని మహేష్ బాబు నుంచి వసూలు చేస్తామని చెప్పారు GST అధికారులు.

Posted in Uncategorized

Latest Updates