సలాం సార్ : తెలంగాణ హక్కుల నేత కేశవరావ్ జాదవ్ కన్నుమూత

KESHAV RAO JADAVతెలంగాణ ఉద్యమకారుడు, పౌర హక్కుల నేత  ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ శనివారం (జూన్-16) ఉదయం  కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ హైదరాబాద్ అంబర్ పేట్ డీడీ కాలనీలోని  తన నివాసంలో తుదిశ్వాస  విడిచారు. ఆయన 1933 జనవరి 27న హుస్సేనీఆలంలో జన్మించారు. హైదరాబాద్ లోనే  పుట్టి  పెరిగిన కేశవరావు జాదవ్..  తెలంగాణ  హక్కుల కోసం మొదటి నుంచి పోరాడారు.  నిజాం కాలేజీలో చదువుకుంటన్నప్పుడు 1953లో ముల్కీ వార్ లో పాల్గొన్నారు.

తొలి,  మలిదశ  ఉద్యమంలో ఎంతో  కీలక పాత్ర పోషించారు కేశవరావు జాదవ్. ఫజల్ అలీ కమిషన్ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకు ఆయన అనేక  నివేదికలు ఇచ్చారు. తెలంగాణ భావజాలాన్ని జనంలోకి  తీసుకెళ్లేందుకు సాహిత్య రచనలు చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1969 ఉద్యమంలోనూ కీలకంగా ఉద్యమించారు. తెలంగాణ జన పరిషద్ కు.. కన్వీనర్ గా పనిచేశారు. తనను తానే మిస్టర్ తెలంగాణ అని చెప్పుకునేవారు జాదవ్. తెలంగాణ  పోరాటంలో అన్ని దశల్లో పోరుసాగించిన చివరితరం నాయకుడు ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్. ఆయన మరణం  తెలంగాణకు తీరని లోటని ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates