సలాడ్ లో బొద్దింక ఏంటి…87 లక్షలు కట్టాలని ప్రయాణికుడి డిమాండ్

pilla2తనకు పెట్టిన సలాడ్ లో బొద్దింక వచ్చిందంటూ ఓ విమాన ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారంటూ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా నష్టపరిహారంగా విమానయాన సంస్ధ తనకు 87 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.
యూసఫ్‌ ఇక్బాల్‌ అనే లాయర్ మంగళవారం(ఫిబ్రవరి27) భార్య, స్నేహితులతో కలిసి తన బర్తడే సెలబ్రేషన్స్ ముంబైలో చేసుకొనేందుకు మొరాకోలో ఎమిరేట్స్ విమానం ఎక్కాడు. ప్రయాణసమయంలో అతడికి ఇచ్చిన చికెన్ సలాడ్ లో బొద్దింక ఉండటం యూసఫ్ షాక్ అయ్యాడు. బర్తడే సెలబ్రేట్ చేసుకుందామని ముంబైకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ తర్వాత చేయాల్సిన విమాన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా నష్టపోయానని…. అందుకుగాను తనకు 87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఎమిరెట్స్‌ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపించాడు యూసఫ్. ఈ ఘటన కారణంగా వృత్తిపరంగా 30 లక్షలు నష్టపోయానని, అనుభవించిన మానసిక వేదనకు 50 లక్షలు, టికెట్‌ ఖర్చులు రూ.7 లక్షలతో కలిపి మొత్తం 87 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో తెలిపాడు. అయితే యూసఫ్ నోటీసులపై ఎమిరేట్స్ ఎయిర్ లైన్ ప్రతినిధులు స్పందించారు. మొరాకోలో ఈ సీజన్‌లో ఇటువంటి కీటకాలు సాధారణంగా కనిపిస్తాయని, అయితే అది విమానంలోకి ఎలా వచ్చిందో అర్థంకావడం లేదని తెలిపారు. అయితే ఎయిర్ లైన్ ప్రతినిధులు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని యూసఫ్ నష్టపరిహారాన్ని ఏప్రిల్‌ నెలలోపే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ముంబైకి చెందిన యూసఫ్ గత 17 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. లండన్‌కు చెందిన అంతర్జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు.
pilla

Posted in Uncategorized

Latest Updates