సల్మాన్ కు జైలు : ఆ రోజు అడవిలో ఏం జరిగింది

salబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు రాజస్థాన్ జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 1998లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసు ఇది. 20 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేయనున్నారు. అయితే ఈ కేసులో శిక్ష పడటంతో 20 ఏళ్ల క్రితం.. అప్పుడు అడవిలో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.

ఆ రోజు అడవిలో ఏం జరిగిందంటే?

1998లో సల్మాన్ ఖాన్ హీరోగా హహ్ సాథ్ సాథ్ హై అనే సినిమాలో నటిస్తున్నాడు. అతనికి కో స్టార్స్ లో సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు కూడా ఉన్నారు. వీరందరూ సెప్టెంబర్ నెల చివరిలో రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ వెళ్లారు. షూటింగ్ సమయంలోనే జోధ్ పూర్ సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో వీరు తిరుగుతున్నారు. అలా వెళుతున్న సమయంలో కంకణి అనే గ్రామంలో కృష్ణ జింకలు సంచరిస్తున్నాయి. వీటిని సల్మాన్ ఖాన్ వేటాడాలి అనుకున్నాడు. ఆ వెంటనే తన దగ్గర లైసెన్స్ తుపాకీతో జింకలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల శబ్ధంతో ఏం జరుగుతుందో తెలియక కంకణి గ్రామస్థులు భయపడ్డారు. వెంటనే గ్రామం చుట్టూ గాలించారు. అక్కడ వారికి రెండు కృష్ణ జింకలు చనిపోయి కనిపించాయి. చంపింది ఎవరూ అని వెతుకుతుండగా వారికి సల్మాన్ కంట పట్టాడు. పట్టుకోవటానికి ప్రయత్నించగా పారిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

1998, అక్టోబర్ 2వ తేదీన కృష్ణ జింకల మరణంపై పోలీస్ కేసు పెట్టారు బిష్నోయ్ వర్గానికి చెందిన కంకణి గ్రామస్తులు. కృష్ణ జింకలను కంకణి గ్రామస్తులకు కులదైవం. వాటిని శ్రీకృష్ణుడి అవతారంగా భావిస్తారు. జింకలకు నిత్యం పూజలు చేస్తుంటారు. అలాంటి వాటిని చంపటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తీసుకున్నారు కంకణి గ్రామస్తులు. సల్మాన్ తోపాటు సైఫ్ అలీఖాన్, సోనాలిబింద్రే, టబు, మూవీ డైరెక్టర్ నీలమ్ కొఠారిపై కేసు నమోదు అయ్యింది.

సల్మాన్ ఖాన్ తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ జింకను చీల్చుకుంటూ వెళ్లింది అని పోలీస్ విచారణ చెబుతోంది. ఉద్దేశ పూర్వకంగానే జింకలను వేటాడారు అని చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి జరుగుతున్న కోర్టు విచారణ జరుగుతుంది. ఏప్రిల్ 5వ తేదీ గురువారం జోధ్ పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. సల్మాన్ ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగతా నలుగురిని నిర్ధోషులుగా తెలిపింది కోర్టు.

 

Posted in Uncategorized

Latest Updates