సల్మాన్ బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం తీర్పు

salmanసల్మాన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదోపవాదనలతో విచారణ ముగిసింది. సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆయన ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు. తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత వెల్లడించనున్నట్లు తెలిపారు న్యాయమూర్తి.

రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే ఉన్నారు. కొద్ది క్షణాల్లో ఆయనకు బెయిల్ ఇస్తారో…లేదో తేలుస్తోంది

 

 

Posted in Uncategorized

Latest Updates