సస్పెన్స్ కు బ్రేక్: ఛత్తీస్ గఢ్ సీఎంగా భూపేశ్ బఘెల్

ఛత్తీస్ గఢ్ సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు బ్రేక్ పడింది. ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ భూపేశ్ బఘెల్ ను ఛత్తీస్ ఘడ్ సీఎంగా కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. కాంగ్రెస్ శాసన సభాపక్ష భేటీలో భూపేశ్ ను పార్టీ ఎమ్మెల్యేలంతా తమ శాసన సభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ భేటీ తర్వాత సీఎంగా భూపేశ్‌ పేరును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు తెలిపారు. రేపు(సోమవారం) ఆయన రాయ్ పూర్ లో ఛత్తీస్ గఢ్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం రేసులో కాంగ్రెస్‌ నుంచి భూపేశ్‌తో పాటు సింగ్‌దేవ్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహు పోటీ పడగా చివరికి హై కమాండ్ భూపేశ్ వైపే మొగ్గు చూపింది.

Posted in Uncategorized

Latest Updates