సస్పెన్స్ తో చంపేసిన క్రికెటర్ : మీల్స్ బిల్లు రూ.7లక్షలు

వెజ్ సింగిల్ మీల్స్ 50, ఫుల్ మీల్స్ 80, పెద్ద రెస్టారెంట్ మీల్స్ తింటే 500 అవుతుంది.. ఇక రెస్టారెంట్ లో ఫ్యామిలీతో వెళితే వెయ్యి, 1500 అవుతుంది.. 7 లక్షల రూపాయల బిల్లు అయితే అవుతుందా.. ఏంటీ తిన్నది బిర్యానీనా లేక బంగారమా అని డౌట్ రావొచ్చు కదా.. కానీ ఆ 7లక్షల రూపాయల మెనూ ఎలా ఉందో చూడండి..

చోలె కర్రీ : 90వేలు, పన్నీర్ బట్టర్ : 99వేలు, పన్నీర్ టిక్కా : 96వేలు, స్ర్పింగ్ వాటర్ : 60వేలు, స్టఫుడ్ కుల్చా : లక్షా 26వేలు, వెజ్ కబాబ్ : లక్షా 35వేలు, సర్వీస్ ట్యాక్స్ : 30వేలు, ట్యాక్స్ : 63వేలు, మొత్తం రూ.7లక్షలు..

లిస్ట్ తో సహా పోస్ట్ చేశారు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా. మీల్స్ కోసం 7లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది.. వెల్ కమ్ టూ ఇండోనేషియా అని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ తో మస్త్ ఫాలోయింగ్ ఉన్న ఆకాష్ చోప్రా ట్విట్ నిమిషాల్లో వైరల్ అయ్యింది. ఒక్క భోజనం 7లక్షల రూపాయలా.. బంగారంతో చేసిన మీల్స్ తిన్నారా అంటూ అందరూ రీట్విట్ చేశారు. దీనిపై రెండు రోజులు సస్పెన్స్ కొనసాగించిన చోప్రా అసలు విషయం తీరిగ్గా చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీలో ఈ బిల్లు కట్టాను.. మన రూపాయి అక్కడ 210 ఇండోనేషియా రూపియాలతో సమానం.ఈ లెక్కన చోప్రా ఇండియన్ కరెన్సీలో కట్టిన బిల్లు.. రూ.3వేల 334 మాత్రమే. బిల్లు ఇండోనియా కరెన్సీలో ఉండటంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యి బెంబేలెత్తిపోయారు. చోప్రా పార్టీ ఇచ్చి.. ఫ్యామిలీ డిన్నర్ అని చెబుతున్నాడు అంటూ తిట్టిపోశారు. కొంచెం నవ్వుకుంటే.. మరికొందరు నవ్వులాటలు మరీ ఎక్కువ అయ్యాయంటూ చురకలు అంటించారు. మీల్స్ కు 7లక్షల బిల్లు మాత్రం మంచి పాపులర్ అయ్యింది..

Posted in Uncategorized

Latest Updates