సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘లా’ మూవీ

law movieప్రతి మనిషికి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించడం లేదంటే.. ఎదురయ్యే ఇబ్బందులు, మలుపులు ఎలా ఉంటాయి అనే కథాంశంతో రూపొందిన మూవీ ‘లా’. ‘‘లవ్ అండ్ వార్’’ అనే ట్యాగ్ లైన్.  క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. హీరోగా కమ్ బ్యాక్ మూవీ అనగానే చాలా ఆలోచించాను అంటున్నాడు హీరో కమల్ కామరాజ్. దర్శకుడు  గగన్ గోపాల్ చాలా డిటైల్డ్ గా కథ చెప్పాడు.. చెప్పిన తీరే నన్ను బాగా ఇంప్రెస్ చేసిందన్నారు. ఇది పూర్తి స్థాయి క్రైం థ్రిల్లర్ అని.. కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయని ధీమాగా చెబుతున్నారు కమల్ కామరాజ్. ‘లా’ అనే టైటిల్ కూడా కథలోంచే వచ్చింది అంటున్నాడు. ఇందులో హీరోయిన్ గా మౌర్యాణి నటిస్తోంది. తెలుగులో ఏడో సినిమా మౌర్యాణికి. ఫెర్ఫార్మెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్రకు నన్ను అప్రోచ్ అవ్వడం ఆనందం కలిగిందన్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లా’ మూవీ త్వరలో విడుదలకు సిద్దం అవుతుంది. పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి  కీలక పాత్రలు పోషించారు. నిర్మాత రమేష్ బాబు మున్నా, సహానిర్మాత మద్దిపాటి శివ, కథ, మాటలు,  స్క్రీన్ ప్లే , దర్శకత్వం:  గగన్ గోపాల్ ముల్క

Posted in Uncategorized

Latest Updates