సహనం కోల్పోయిన ప్రొఫెసర్..గార్డును చితకబాదాడు

JNTUHవిద్యా బుద్దులు నేర్పించాల్సిన ప్రొపెసరే సహనం కోల్పోయాడు. సెక్యురిటీ గార్డును చితకబాదాడు. ఈ సంఘటన ఆదివారం (జూలై-8) హైదరాబాద్ లోని కుకట్‌ పల్లి JNTU జరిగింది. యూనివర్సిటీ పరిధిలో ఓ ప్రొఫెసర్‌ రెచ్చిపోయారు. నో పార్కింగ్‌ ప్లేస్‌ లో కారు పెట్టొదని చెప్పినందుకు సెక్యురిటీపై ప్రొఫెసర్‌ దాడి చేశారు. నాకే అడ్డు చెబుతావా అంటూ ప్రొఫెసర్‌ తో సహా అతని భార్యా సెక్యురిటీపై దూర్భాషలాడారు. క్షమించండని చెప్పినా వినకుండా అతన్ని చితకబాదాడు.

అతని దెబ్బలకి తట్టుకోలేక సెక్యురిటీ పక్కనే ఉన్న ఆఫీసు రూమ్‌ లోకి పరిగెత్తాడు. అయినా ప్రొఫెసర్‌ అక్కడికెళ్లి నీ అంతు చూస్తానని చేయిచేసుకున్నారు. తప్పుచేశానని చెప్పినా, కన్నీరు పెట్టుకొని కాళ్లు పట్టుకున్నా.. ప్రొఫెసర్‌ కనికరించలేదు. ఈ సంఘటన అక్కడి విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో..ఈ న్యూస్ వైరల్ గా మారింది.

 

 

Posted in Uncategorized

Latest Updates