సాకర్ వరల్డ్ కప్ : ఓ దేశాన్నే కూల్చేసింది

నెల రోజుల పాటు సాకర్ వరల్డ్ కప్ ప్రపంచాన్ని ఊపేసింది. చివరి ఘట్టంలో ఫుట్‌ బాల్ జగజ్జేతగా నిలిచింది ఫ్రాన్స్. ఫుట్ బాల్ క్రీడ ప్రపంచదేశాలతో అంతగా మమేకమైపోయింది. అంతేకాదు దేశ ప్రభుత్వాలను కూల్చగల సత్తా ఉందని ఈ క్రీడ నిరూపించింది. ఈ దెబ్బకు హైతీ ప్రభుత్వం కూలిపోయింది. ఇందుకు కారణం ఫుట్ బాల్ క్రీడేనట.  హైతీ దేశం ఇంటర్నేషనల్ గా ఎలాంటి విజయాలు నమోదు చేయలేదు. అందులో ఆదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు కానీ.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కానీ.. పెద్దగా కనిపించరు. ఇందుకోసం ఆదేశ ప్రజలు అంతర్జాతీయ వేదికలపై బ్రెజిల్ తమ అనధికార దేశంగా భావిస్తారు.

ఇదే హైతీ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని జాక్ గై లఫాన్‌ టంట్ కొంప ముంచింది. సాకర్ వరల్డ్ కప్‌ లో భాగంగా బ్రెజిల్, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ లో బ్రెజిల్.. బెల్జియం చేతిలో 2-1 గోల్స్ తేడాతో పరాభవం మూటగట్టుకుని ఇంటిదారి పట్టింది.  ఈ ప్రభావం హైతీ దేశ ప్రజలపై పడింది. ఓటమిని జీర్ణించుకోలేని వారు రోడ్లపైకొచ్చి నానా రభస చేశారు. అల్లర్లు సృష్టించారు. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో ఆ దేశ ప్రధాని జాక్ గై లఫాన్‌ టంట్ రాజీనామా చేశారు. అంతకంటే ముందే హైతీలో ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఇంధన ధరలపై ఇస్తూ వస్తున్న సబ్సీడీని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉందంటూ ప్రచారం జరగడంతో.. హైతీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

బ్రెజిల్ ..బెల్జియం దేశాల మధ్య ఫుట్‌ బాల్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ మరో పదినిమిషాల్లో మొదలవుతుంది అనగా… హైతీ ప్రభుత్వం ఇంధన ధరలపై సబ్సీడీ ఇవ్వడం ఎత్తివేస్తున్నామంటూ ప్రకటన చేసింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అదే సమయంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ కెవిన్ డె బ్రూఇన్ కొట్టిన గోల్‌ ను నిలువరించడంలో బ్రెజిల్ గోల్ కీపర్ విఫలమవడంతో ఆ మ్యాచ్ లో బ్రెజిల్ ఓడిపోయింది. ఈ ఓటమి కూడా అక్కడి ప్రజలను చాలా నిరాశకు గురిచేయడంతో ఆ బాధను తమ నిరసన కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates