సాకర్ సమరంలో అద్భుతం : ఇంగ్లాంగ్ చిత్తు..ఫైనల్ కి క్రొయేషియా

ఫిఫా వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఆశ్చర్యకర ప్రదర్శన కొనసాగిస్తూ సంచలనాల క్రొయేషియా మరోసారి సత్తా చాటింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో గెలిచి మొదటిసారి ఫైనల్ కు చేరింది. దీంతో క్రొయేషియా తమ ఫుట్ బాల్ చరిత్రను తిరగరాసింది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్ చేరాలన్న ఇంగ్లాండ్ కలలను క్రొయేషియా భగ్నం చేసింది. రెండు దశాబ్దాల తర్వాత సెమీస్ కు చేరి… చిరస్థాయిలో నిలిచేలా ఆడింది క్రొయేషియా. ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో గెలిచి.. తొలిసారి ఫైనల్ కు చేరింది. ఆదివారం (జూలై-15) ఫ్రాన్స్ తో జరిగే ఫైనల్ లో అమీతుమీ తేల్చుకోనుంది క్రొయేషియా.

Posted in Uncategorized

Latest Updates