సాక్ష్యాలు ఇచ్చిన తనుశ్రీదత్తా.. నానాపటేకర్ కు నోటీసులు

ముంబై : బాలీవుడ్ నటుడు నానాపటేకర్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ మంగళవారం నోటీసులు పంపింది. 2008లో తనను కొందరు సినీ ప్రముఖులు వేధించారంటూ ఇటీవల మహారాష్ట్ర మహిళా కమిషన్ కు కంప్లయింట్ చేసింది తనుశ్రీదత్తా. గతంలో తాను ముంబై పోలీసులకు కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదని… దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. పిటిషన్ ను విచారణకు తీసుకున్న కమిషన్ చైర్ పర్సన్ విజయ రాహత్కర్…. నటుడు నానా పటేకర్ తో సహా… ప్రొడ్యూసర్ సామీ సిద్దిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ రాకేశ్ సారంగ్ లకు కూడా నోటీసులు పంపించారు. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. విదేశాల్లో ఉన్న తనుశ్రీదత్తాతో వీడియో లింక్ లో మాట్లాడారు కమిషన్ చైర్ పర్సన్. విచారణలో భాగంగా తనుశ్రీదత్తా కూడా కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని విజయ రాహత్కర్ చెప్పారు.

ఈ వ్యవహారంలో నానాపటేకర్ కు మొదటినుంచే కొందరు సినిమా సెలబ్రిటీలు మద్దతుగా ఉంటున్నారు. డైరెక్టర్ రాకేశ్ సారంగ్ కూడా నానాపటేకర్ కు సపోర్ట్ గా ఉన్నారు. తనుశ్రీదత్తా చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. పబ్లిసిటీ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

మరోవైపు.. వేధింపుల కేసులో తనుశ్రీదత్తా మరోసారి ముంబై పోలీసులను సంప్రదించింది. 2008లో తనపై జరిగిన వేధింపులకు సంబంధించి 40పేజీల డాక్యుమెంట్ ను, ఇతర సాక్ష్యాధారాలను ముంబై పోలీసు స్టేషన్ కు ఇచ్చింది. 2008లో తాను ఇచ్చిన ఫిర్యాదు కాపీని కూడా ఇందులో జతపరిచింది. ఆమె తరఫు లాయర్ ఈ డాక్యుమెంట్లను మహిళా కమిషన్ కు కూడా అందించారు.

Posted in Uncategorized

Latest Updates