సాగుకు ప్రత్యేకం : మార్చి 14 లేదా 15న తెలంగాణ బడ్జెట్

15TH_T_BUDGET__+15TH_T_BUDGET_.jpg2018–19 వార్షిక బడ్జెట్‌ను మార్చి 14 లేదా 15న ప్రవేశపెట్టాలని నిర్ణయించింది  తెలంగాణ ప్రభుత్వం. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తోంది. పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి వీలుగా సమావేశాలు రెండు వారాలు జరగవచ్చు. పంచాయతీరాజ్‌ కొత్త చట్టం బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ఇటీవలే ప్రకటించారు  సీఎం. సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావటంతో మరిన్ని జనాకర్షక పథకాలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖల ప్రతిపాదనలు, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

పోయిన సంవత్సరం రూ. కోటీ నలబై తొమ్మిది లక్షల కోట్ల బడ్జెట్‌లో.. నిర్వహణ పద్దు కింద రూ.61 వెయ్యి 607 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88 వేల 38 కోట్లు కేటాయించింది. ఈసారి భారీ అంచనాలుండటం, ఆదాయ వృద్ధీ ఆశించినంతగా ఉండటంతో భారీ బడ్జెట్‌ను ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రూ.1.8 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  రెండేళ్ల కిందట సాగునీటికి స్పష్టమైన కేటాయింపులతో కొత్త అధ్యాయానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాలని నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టులకు ఈసారీ భారీగా నిధులందనున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయటంతో పాటు 50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్య సాధనకు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పరిపూర్తి తదితరాలకు రూ.30 వేల కోట్ల దాకా కేటాయించవచ్చు.  పాత పథకాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఈసారి బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆసరా పెన్షన్ల మొత్తం, పరిధి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ఆర్థిక సాయం పెంపు, నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి తదితరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుపేద గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే పథకానికీ రూపకల్పన చేస్తోంది. అలాగే జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates