సాటిరారు నీకెవ్వరూ : ఈ ఎమ్మెల్యే మురికిలోనే పొర్లుతాడు.. అక్కడే తింటాడు..

Ayaz-Memon-Motiwalaరాజకీయం అంటేనే రొచ్చు అంటారు.. అందులోకి దిగితే బురద అవ్వటమే కాదు.. మిగతా వారికీ బురద అంటిస్తారు అంటూ సామెతలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని ఓ ఎమ్మెల్యే టోటల్ డిఫరెంట్. ఎన్నో ఏళ్లుగా ఇతను చేస్తున్న చెత్త, బురద రాజకీయం ఇన్నాళ్లకు ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఇప్పుడు అందరూ ఈయన గురించే చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ పొలిటికల్ లీడర్ అనగానే ఐయాజ్ మెమెన్ మోటీవాలా గుర్తుకొస్తున్నాడు. ఇతడు చేసే బురద, చెత్త రాజకీయం హాట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే..

ఐయాజ్ మెమెన్ మోటీవాలా ఓ పొలిటికల్ లీడర్. ప్రస్తుతం – NA 243 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు తన రాజకీయానికి మరింత పదునుపెట్టాడు. ప్రత్యర్థుల ఊహలకు అందని విధంగా మాస్ ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు రోడ్ల పరిశుభ్రత, రోడ్ల మురుగునీటి ప్రవాహాన్ని ప్రచారాంశంగా ఎన్నుకున్నారు. ధర్నాలు చేస్తున్నారు. వారికి ఏ మాత్రం తగ్గని.. మోటీవాలా మొన్నటి మొన్న జూన్ 29వ తేదీ శుక్రవారం తన నిరసన వ్యక్తం చేశాడు. రోడ్లపై ఉన్న మురుగునీటిలోనే కూర్చున్నాడు. అందులోనే పొర్లాడాడు.. అక్కడే తిన్నాడు.. అక్కడే టీ, కాఫీ తాగాడు. ఓ అడుగు ముందుకేసి రోడ్లపై నిలిచిన మురుగునీటినే తాగేశాడు. అందరూ షాక్.. మరీ ఏంటయ్యా ఇదీ అంటే.. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియాలి.. ప్రజలు పడుతున్న బాధలు కూడా నాకు తెలియాలి కదా అంటున్నాడు. ఒక్కడే.. సింగిల్ గా పాక్ జాతీయ జెండా పట్టుకుని వీధుల్లో ఎక్కడ మురుగునీరు ఉందో అక్కడ పొర్లుతున్నాడు.. ఈ వ్యవహారం ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం రచ్చ రచ్చ అవుతోంది.

ఎమ్మెల్యే మోటీవాలా ఇప్పుడు ఇలా చేస్తున్నాడా అంటే.. అబ్బే లేనేలేదు. ఈయన రెండేళ్లుగా ఇలాంటి వ్యవహారాలే చేస్తున్నాడు. చెత్త డంపింగ్ యార్డుల్లో భోజనాలు చేస్తాడు. మురుగు నాలాలపై కూర్చుని ప్రసంగాలు ఇస్తాడు.. మ్యాన్ హోల్స్ లో దిగి కంపు చూపిస్తాడు.. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు. దాన్ని తొలగించే వరకు అక్కడే ఉంటాడు. మోటీవాలా చెత్త, కంపు రాజకీయం చూసి సాటిరారు నీకెవ్వరూ అంటోంది పాక్ యువత. బహుశా ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చేసి ఉండరని గట్టిగానే వినిపిస్తోంది నెటిజన్ల నుంచి. ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. గెలిచి తీరతానని శపథం కూడా చేస్తున్నాడు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న మోటీవాలా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆకర్షించేస్తున్నాడు.. ఓట్ల రాజకీయమా మజాకా అంటున్నారు. ఓట్ల కోసం మరీ ఇంత చేయాలా అనే వాదన కూడా వినిపిస్తోంది…

#موتیوالا_نے_گٹر_کا_پانی_پی_کے_حُکمرانوں_کو#دعوت_دےدی_کہ_کوئی_ایک_عوام_کے_مُفاد_میں#کیا_گیا_کام_بتاؤں #میرے_ساتھ_بیٹھ_کے_گٹر_کے#پانی_میں_جیسے_عوام_پیتے_ہیں_گندا_پانی_پیئو#نلکا #ایسا_انشاءاللّہ #پانی_سے_بھرا#Tareekh_Raqam#Teen_Azad_Halqo_Par_Ek_Hi #Intakhabi#Nishan #Nalqa (نلکا)#Nalkay_Ko_Vote_Do 🙂 #Nalqay_Me_Pani_Lo 🙂 #Thappa_Lagao_Sirf_Nalqay_Ko 🙂#PS_110#PS_111#NA_243

Ayaz Memon Motiwala 发布于 2018年6月30日周六

Posted in Uncategorized

Latest Updates