సాధించారు: సౌదీ మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ లైసెన్సులు

saudiసౌదీ అరేబియా మహిళలు అనుకున్నది సాధించారు. డ్రైవింగ్ లైసెన్సులను సొంతం చేసుకున్నారు. సోమవారం(జూన్-4) సుమారు 10 మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్సులను పొందారు. మూడు వారాల క్రితమే ఆ దేశ ప్రభుత్వం మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

సుమారు 30 ఏళ్ల నుంచి అక్కడి మహిళలు తమకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వాలంటూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో  డ్రైవింగ్ లైసెన్సు జారీ చేసిన పది మంది మహిళలకు విదేశాల్లోనూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నారు. డ్రైవింగ్ టెస్ట్, కంటి పరీక్షల తర్వాత రియాద్‌లోని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఈ లైసెన్సులను జారీ చేసింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates