సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ నిరసన : పీక్ స్టేజ్ లో ఆఫీస్ కు ఇలా వచ్చాడు

SOFT-EMPLOYE-FBఐటీ కంపెనీలో జాబ్.. పెద్ద సంస్థ.. జీతం కూడా లక్షల్లో ఉంది.. అయినా జీవితంలో ఏదో వెలితి.. తీరని ఆవేదన.. ఆవేశం.. ఆగ్రహం.. తొక్కలో ఉద్యోగం అనుకున్నాడు.. వెంటనే రాజీనామా చేసేశాడు. దీనికితోడు బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ రద్దీ.. ఆఫీసులోనే 10 గంటలు గొడ్డు చాకిరీతోపాటు.. ఆఫీస్ టూ హౌస్ జర్నీకి మరో 4 గంటల సమయం.. మొత్తంగా 16 గంటలు బయటే.. కొంపలో ఉండేది చాలా తక్కువ సమయం.. దీంతో జీవితంపై విరక్తి చెందాడు.. ఉద్యోగానికి రాజీనామా చేశాడు.. స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయటానికి రెడీ అయ్యాడు. ఇది వ్యక్తిగతం.. అయితే బెంగళూరులో సిటీలో ట్రాఫిక్ రద్దీపై మాత్రం తన అక్కసు వెళ్లగక్కాలని నిర్ణయించాడు. అనుకున్నదే తడవుగా.. ఆఫీస్ చివరి వర్కింగ్ డే రోజున తన కారు, బైక్, క్యాబ్ కాదని.. ఏకంగా గుర్రం ఎక్కి వచ్చాడు. ఇంటి నుంచి బాగా కష్టపడి, ట్రాఫిక్ రద్దీని తట్టుకుని గుర్రంపై ఆఫీసుకు వచ్చాడు. దానికి ఓ బోర్డు కూడా తగిలించాడు. లాస్ట్ వర్కింగ్ డే ఏజ్ ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని రాసిన బోర్డు తగిలించాడు. ఆఫీస్ పార్కింగ్ లోకి వచ్చి గుర్రాన్ని కట్టేశాడు.

ఇంతకీ ఇతని పేరు ఏంటో తెలుసా.. రూపేశ్ కుమార్ వర్మ. ప్రతి ఒక్కరికీ యూనియన్స్ ఉన్నప్పుడు.. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ కు ఎందుకు సంఘాలు లేవని ప్రశ్నిస్తున్నాడు. దేశంలో కోకొల్లలు సమస్యలు ఉన్నాయని.. వాటిలో ఒక్కటి పరిష్కరించినా నాకు ఆనందమే అంటున్నాడు. ఉద్యోగం.. ఉద్యోగం అంటూ బాధపడొద్దని.. ధైర్యంతో కంపెనీలే పెట్టండని సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కోరుతున్నాడు.

Posted in Uncategorized

Latest Updates