సామాజిక, రాజకీయ మార్పు కోసమే రాజకీయాల్లోకి : పవన్

pawansklmసామాజిక, రాజకీయ మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పాలకులే కారణమని విమర్శించారు. శ్రీకాకుళంలో కొనసాగుతున్న జనపోరాట యాత్రలో పాల్గొన్న పవన్… ప్రత్యేక హోదా అంశంపై సీఎం చంద్రబాబు 33 సార్లు మాట తప్పారన్నారు. ఉద్దానం బాధితుల కష్టాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. వేల మంది జీవితాలు ఛిద్రం అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టులు, పుష్కరాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారనీ, బాధితులను మాత్రం గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం ప్రజల కోసం తానున్నానని భరోసా ఇచ్చారు జనసేనాని పవన్.

రాష్ట్రంలో ఇసుక మాఫియా జోరుగా నడుస్తోంది. సీఎం ముద్దుల కొడుకు లోకేశ్.. అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. మా నాన్నగారు వేసిన రోడ్లపై నడుస్తున్నారని లోకేశ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీనాన్న జేబులో ఉన్న డబ్బులతో రోడ్లు వేశారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

Posted in Uncategorized

Latest Updates