సామాన్యుడికి చుక్కలే…మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కులు చూపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ పై 12 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ. 82.48 ఉండగా,డీజిల్ 28 పైసలు పెరిగి రూ.74.90కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.94 కాగా, డీజిల్ ధర రూ.78.51కి చేరింది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.87.44 కాగా, డీజిల్ ధర రూ.81.47 కు చేరుకొంది.
పెట్రోల్, డీజిల్‌ పై గత వారం రూ.2.50 పైసలు చొప్పున కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇంతే మొత్తానికి వ్యాట్ తగ్గించాలని కేంద్ర మంత్రి జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ పాలిత 13 రాష్ట్రాలతో పాటు గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ వెంటనే తగ్గింపును ప్రకటించాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ ఆయిల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతుండటంతో తమ ఇబ్బందులు షరామామూలే అంటున్నారు వాహనదారులు.

Posted in Uncategorized

Latest Updates