సామాన్యుడికి శక్తులు : స్పైడర్‌ మ్యాన్ సృష్టికర్త కన్నుమూత

spider
స్పైడర్‌మ్యాన్ సృష్టికర్త స్టీవ్ డిట్కో(90) కన్నుమూశారు. న్యూయార్క్‌ లో డిట్కో తుదిశ్వాస విడిచారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ సంతాపం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర మాత్రమే శక్తులు ఉంటాయని అంటారు.. అలాంటి శక్తి ఓ సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుంది.. ఎలాంటి మంచి పనులు చేస్తాడు అనే దానికి నిదర్శనమే ఈ స్పైడర్ మ్యాన్ సృష్టి అంటారు డిట్కో.

మార్వెల్ కామిక్స్ కోసం రైటర్ స్టాన్ లీ తో కలసి డిట్కో పనిచేశారు. 1960 దశకం తొలి రోజుల్లో ఆయన ప్రపంచంలోనే  అద్భుతాన్ని సృష్టించాడు. ఫేమస్ స్పైడర్‌మ్యాన్ క్యారక్టర్‌ ను డిజైన్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ క్యార్టకర్ రూపకల్పనలో కూడా డిట్కో పనిచేశారు.  మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్ లీ ఇచ్చిన ఐడియాకు ప్రాణం పోశారు ఆయన. సాలీడు శక్తులతో టీన్ సూపర్‌హీరోను క్రియేట్ చేయాలని లీ సూచించాడు. దానికి తగ్గట్టుగా స్పైడర్‌మ్యాన్ వేషధారణను డెవలప్ చేశాడు డిట్కో. బ్లూ, రెడ్ డ్రెస్‌తో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌మ్యాన్‌ను డిట్కో డిజైన్ చేశాడు.

డిట్కో కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు మార్వెట్ ఎంటర్ టెయిన్ మెంట్ ప్రెసిడెంట్ డాన్ బక్లీ తెలిపారు. ఆయన లెగసీ మర్చిపోలేనిదని అన్నారు. డిట్కో మృతిపై అనేకమంది రచయితలు, హాలీవుడ్ డైకర్టర్లు సంతాపం తెలిపారు. భౌతికంగా డిట్కో లేకపోయినా ఆయన సృష్టించిన పాత్రల ద్వారా ఆయన ఎప్పుడూ బతికే ఉంటారని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates