సామాన్యులకు కూడా : అందుబాటు ధరలో రాయల్ వెడ్డింగ్ కార్

rollsమధ్యప్రదేశ్ లోని ఓ వెడ్డింగ్ ప్లానర్  హమిద్ ఖాన్… తన కారుని రీమోడల్ చేసిన విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన కారుని అచ్చం ఒరిజనల్ రోల్స్ రాయిస్ కారులానే రీమోడల్ చేశాడు  హమిద్ ఖాన్. దీనికి రాయల్స్ వెడ్డింగ్ కారు అని పేరు పెట్టాడు. సాధారణ మధ్యతరగతి కపుల్స్ కూడా తాము రోల్స్ రాయిస్ లో జర్నీ చేస్తున్నాం అనే ఫీలింగ్ కలగాలన్న ఉద్దేశంతోనే తాను కారుని రీమోడల్ చేసినట్టు హమిద్ తెలిపాడు.

దీనికి తాను చార్జీలు ఎంతన్నది తాను డిసైడ్ చేయలేదని తెలిపారు. మధ్యప్రదేశ్ లో రోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ రాయల్స్ వెడ్డింగ్ కారుని చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఇది నిజంగానే అచ్చం ఒరిజినల్ రోల్స్ రాయిస్ లానే ఉందంటున్నారు. మధ్యతరగతి కపుల్స్ కూడా తక్కువ ఖర్చుతో ఇకపై ఈ రాయల్స్ వెడ్డింగ్ కారులో ప్రయాణించవచ్చని స్ధానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates