సామాన్యులు బతికేదెట్టా : పాల ప్యాకెట్ల పంపిణీలోకి స్విగ్గీ, బిగ్ బాస్కెట్

online-deleveryఏం కావాలన్నా.. ఎంత కావాలన్నా.. అంతెందుకు ఒక్క గులాబ్ జామ్ కావాలన్నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వాస్తవంగా అయితే ఆ గులాబ్ జామ్ అంత ధర అవుతుందో.. రవాణా ఖర్చులు అంత ఉంటాయి. అయినా సరే.. ఇంటికి తెచ్చి ఇస్తాం అంటున్నాయి ప్రముఖ ఆన్ లైన్ సర్వీస్ దిగ్గజాలు స్విగ్గీ, బిగ్ బాస్కెట్. ఇప్పుడు ఈ రెండు సంస్థలు సరికొత్త రంగంలోకి దిగుతున్నాయి. అదే మిల్క్ బిజినెస్. పాల వ్యాపారం. ప్రతి ఉదయం మనం నిద్ర లేవగానే తలుపు తీసి చూస్తాం.. ఎందుకంటే పాలు ప్యాకెట్ కోసం.. పేపర్ కోసం. ఇప్పుడు స్వీగ్గీ, బిగ్ బాస్కెట్ పాల ప్యాకెట్ల సరఫరాలోకి దిగుతోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాల్లో స్టార్ట్ అప్ కింద చేపట్టాయి కూడా. దీని వెనక అతిపెద్ద వ్యూహం ఉందని చెబుతున్నాయి కంపెనీలు.

ప్రతి కుటుంబం నెలకు సగటున పాల కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇదే అతిపెద్ద మార్కెట్ అంటున్నారు. ఇంటింటికీ పాలప్యాకెట్లతోపాటు ఫంక్షన్లకు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాయి. ఇంటింటికీ పాలప్యాకెట్లు ఇవ్వటం స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తమ మార్కెట్ ను విస్తరించుకోవాలని చూస్తున్నాయి. పాల ప్యాకెట్ పేరుతో ఇంటింటికీ వెళ్లటం వల్ల మరింత చేరువు అవుతామని.. ఆ ఇంటి నుంచి ఇప్పుడు స్వీగ్గీకి ఆర్డర్స్ పెంచుకోవటం ఈజీ అవుతుందని చెబుతున్నారు. పాల ప్యాకెట్ అనేది నిత్యావరం.. జీవితాంతం అవసరం ఉంటుంది.. అలాంటి కుటుంబంతో సాన్నిహిత్యం స్వీగ్గీకి మంచి భవిష్యత్ అంటోంది కంపెనీ. ఇప్పటికే చెన్నై సిటీలో స్టార్టప్ కింద కొంత మందిని ఎంపిక చేసుకుని.. ప్రాజెక్ట్ నడుస్తుందని తెలిపింది.

స్వీగ్గీ ఎక్కడ ఉంటే.. అక్కడ పాల ప్యాకెట్ ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే బాటలో బిగ్ బాస్కెట్ కూడా ఉంది. ఈ రెండు కంపెనీలు వివిధ నగరాల్లోని మిల్క్ డెలివరీ స్టార్టప్ లతో కలిసి పని చేయటం లేదా వారి బిజినెస్ టేక్ ఓవర్ చేసేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లోని కుటుంబాల్లోని పిల్లలు, యువకులకు ఉదయం పూట పార్ట్ టైం ఉద్యోగంగా పాల ప్యాకెట్లు, పేపర్లు వేస్తూ జీవనోపాది పొందుతున్నారు. ఇందులోకి కూడా కార్పొరేట్ సిస్టమ్ వస్తే.. పాపం ఆ సామాన్యులు బతికేది ఎట్లా…

 

Posted in Uncategorized

Latest Updates