సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీనుంచి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి… రాత్రి అసదుద్దీన్ ఒవైసీ కూతురు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. శనివారం ఉదయం ప్రగతి భవన్ లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కంటి వెలుగు పథకంపై సమీక్ష జరిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను ప్రభుత్వ రికార్డుల్లో భద్రపరచాలన్న ఉద్దేశంతో.. కంటి వెలుగు స్కీమ్ ను విస్తరించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కంటి వెలుగు మాదిరిగానే… చెవి, ముక్కు, గొంతు పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించారు. అధికారులతో సమావేశంలో… చెవి ముక్కు, గొంతు ఉచిత పరీక్షలు ఎప్పటినుంచి నిర్వహించాలి… ఎలా నిర్ణయించాలన్నదానిపై చర్చించారు. తేదీలను ఖరారు చేశారు. ఢిల్లీటూర్ విశేషాలు, E.N.T. పరీక్షల వివరాలను ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ తెలియజేసే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates