సాయంత్రం ట్విట్టర్ లో కేటీఆర్ లైవ్ ఇంటరాక్షన్

హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐటీ మంత్రి కేటీఆర్.. ఇవాళ ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేయనున్నారు. ఇవాళ (అక్టోబర్-4) సాయంత్రం ట్విట్టర్ లో అందుబాటులో ఉంటానని చెప్పారు కేటీఆర్. ట్విట్టర్ యూజర్స్ తమ ప్రశ్నలను #askKTR అనే ట్యాగ్ తో ట్వీట్ చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్.

ట్విట్టర్ లో జనంతో మాట్లాడక చాలా రోజులైందని కేటీఆర్ అన్నారు. మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి.. లైవ్ లో ఉంటా.. మీ ప్రశ్నలకు బదులిస్తా అని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు,  సరదాలు, హాబీలు… ఇలా రకరకాల ఇష్యూస్ పై గతంలో లైవ్ ఇంటరాక్షన్ లో కేటీఆర్ స్పందించారు. ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నామంటే.. వెంటనే ఆ సమస్యను తన సోషల్ మీడియా ఆఫీస్ కు చెప్పి పరిష్కారమయ్యేలా చూస్తుంటారు కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates