సాయంత్రం 4 గంటలకి అమిత్ షా సభ

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్నాహ్నం 2 గంటలకి హైదరాబాద్ కి రానున్న అమిత్ షా..కాచిగూడలోని శ్యాం మందిర్ లో ప్రత్యేక పూజలో పాల్గొననున్నారు. తర్వాత నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయి నాయకులతో భేటీ  కావడంతో పాటు .. ఇబ్రహీంపట్నం, షాద్‌ నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల శక్తికేంద్ర ఇన్‌ చార్జులు, అధికారులతో సమావేశం అవుతారు.

చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని బూత్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, శక్తికేంద్రం ఇన్‌ చార్జీలు, పార్టీ కార్యకలాపాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ బహిరంగ సభకు హాజరుకానున్నారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates