సాయంత్రానికి డెడ్ బాడీ.. శ్రీదేవి ఆఖరి చూపులకి ఆలస్యం

deadశ్రీదేవి భౌతికకాయన్ని ఈ సాయంత్రం (ఫిబ్రవరి-26) ముంబై తీసుకువచ్చే అవకాశం ఉంది. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు….నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం చేశారు. నిన్న  ఆదివారం కావడంతో  దౌత్యపరమైన అనుమతులు పూర్తికాలేదు. దీంతో ఈ ఉదయం 11 గంటల తర్వాత ఫోరెన్సిక్  రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. రిపోర్ట్ వచ్చాకే ఎంబాల్మింగ్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి.

ఎంబాల్మింగ్ చేసేందుకు రెండు గంటలు పడుతుంది.  ఎంబాల్మింగ్ తర్వాతే డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్ వచ్చాకే ఇండియన్ కాన్సులెట్ లో పాస్ పోర్ట్ క్యాన్సిల్ ప్రెసెస్ ఉంటుంది. డెడ్ బాడీని తరలించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి తప్పనిసరి. దీంతో శ్రీదేవీ డెడ్ బాడీ ముంబైకి చేరేసరికి సాయంత్రం దాటే అవకాశం ఉంది.

దీంతో 24 గంటలు గడిచిన డెడ్ బాడీని ఆస్పత్రి నుంచి బయటకు తీసుకురాలేదు. మరోవైపు శ్రీదేవి డెడ్ బాడీని ముంబైకి తీసుకువచ్చేందుకు 11 సీట్ల ప్రైవేట్ జెట్ విమానాన్ని పంపించారు పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ. శ్రీదేవి డెడ్ బాడీని ఇవాళ ముంబైకి తీసుకువస్తుండటంతో….అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.  ఉదయం నుంచి తమ అభిమాన తారను చివరిసారిగా చూడాలన్న ఆత్రుతతో శ్రీదేవి ఇంటి ముందు అభిమానులు పోటెత్తారు.

Posted in Uncategorized

Latest Updates