సాయం అందించండి : రైతే…కాడెద్దుగా మారి పొలాన్ని దున్నాడు

రైతే…కాడెద్దుగా మారి తన పొలాన్ని దున్నుకున్న ఘటన నిర్మల్ జిల్లా బైంసాలో జరిగింది. పట్టణంలోని సిద్దార్థనగర్ కు చెందిన గంగారాం…వ్యవసాయామే జీవనాధారంగా బతుకుతున్నాడు. తనకున్న 5 ఎకరాల్లో 4 ఎకరాలు గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పోయింది. దీంతో వచ్చిన డబ్బులతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేశాడు గంగారాం. ప్రస్తుతం ఎద్దులు కొనే స్థోమత లేక మిగిలిన ఎకరా పొలంలో పత్తి, కూరగాయలను సాగుచేస్తున్నాడు. అయితే పత్తిచేనులో కలుపు తీసేందుకు డబ్బులేక తానే కాడెద్దుగా మారి దున్నుతున్నాడు. ప్రభుత్వం  ఏదైనా సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు ఈ వృద్ద దంపతులు.

Posted in Uncategorized

Latest Updates